mehreen: వాళ్లని చూసిన తరువాతనే నేను హీరోయిన్ కావాలనుకున్నాను: మెహ్రీన్

  • 'కాజోల్ .. కరిష్మా అంటే ఇష్టం 
  • వాళ్ల నటనను అనుసరించేదానిని 
  • అనుకోకుండానే టాలీవుడ్ కి వచ్చేశాను      

తెలుగు తెరపై గ్లామర్ కథానాయికగా ఎక్కువ మార్కులు కొట్టేస్తోన్న కథానాయిక మెహ్రీన్. యువ కథానాయకుల జోడీగా వరుస సినిమాలు చేస్తూ మెహ్రీన్ దూసుకుపోతోంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించిన అనేక విషయాలను చెప్పుకొచ్చింది. "మీరు ఎక్కువగా ఇష్టపడిన కథానాయికలు ఎవరు?" అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది.

 అప్పుడు మెహ్రీన్ స్పందిస్తూ .. "కాజోల్ .. కరిష్మా అంటే నాకు చాలా ఇష్టం. 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' నాకు బాగా నచ్చిన సినిమా" అంది. 'ఇక 'జీత్' మూవీలో 'యారా ఓ యారా' అనే పాటలో కరిష్మాలా నటించేదాన్ని. వాళ్లను చూసిన తరువాతనే హీరోయిన్ కావాలని నాకు అనిపించింది. అలా అని చెప్పేసి టాలీవుడ్ రావాలని నేను ప్లాన్ చేసుకోలేదు. అనుకోకుండానే 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'లో ఛాన్స్ వచ్చింది. అక్కడి నుంచి కథానాయికగా నా కెరియర్ మొదలైంది" అంటూ చెప్పుకొచ్చింది.     

  • Loading...

More Telugu News