North Korea: ఉపగ్రహ ప్రయోగం చేయనున్న ఉత్తరకొరియా!
- క్వాంగ్‌మ్యాంగ్‌సాంగ్-5 పేరిట ప్రయోగం
- కెమెరాలు, టెలికమ్యూనికేషన్ పరికరాలతో ఉన్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి
- అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంవైపు అభివృద్ధి
మూడవ ప్రపంచ యుద్ధ భయాన్ని రేపుతోన్న ఉత్తరకొరియా మరో ప్రయోగం జరిపేందుకు సిద్ధమవుతోందట. అయితే, ఈ సారి క్షిపణి పరీక్షలు, అణు పరీక్షలు కాకుండా ఉపగ్రహ ప్రయోగం చేస్తుందట. తాజాగా దక్షిణకొరియా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరకొరియా క్వాంగ్‌మ్యాంగ్‌సాంగ్-5 పేరిట ఒక ఉపగ్రహాన్ని సిద్ధం చేసింది.
కెమెరాలు, టెలికమ్యూనికేషన్ పరికరాలతో ఉన్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. మరోపక్క, తమ దేశం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో కూడా అభివృద్ధి చెందుతోందని ఉత్తరకొరియా మీడియా కూడా ఇటీవల పేర్కొంది. ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కాగా, ఆ దేశం గత ఏడాది ఫిబ్రవరిలో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించి విజయవంతమైంది.