rp patnaik: 'శంకరాభరణం' మూవీ 50 .. 60 సార్లు చూసుంటాను!: ఆర్పీ పట్నాయక్

  • 'శంకరాభరణం' పాటలు బాగా పాడేవాడిని 
  • అందరూ నన్ను 'శంకరశాస్త్రి' అనేవారు 
  • గాయకుడిని కావడానికి బాలు గారే స్ఫూర్తి

సంగీత దర్శకుడిగా .. నటుడిగా .. గాయకుడిగా .. దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ తన ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటూ వస్తున్నారు. కొంతకాలంగా సంగీత దర్శకత్వానికి దూరంగా ఉంటూ వస్తోన్న ఆయన, తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో తనకి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

అలీ అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ," సంగీత దర్శకుడిని కావాలనే ఆలోచన నాకు పీజీ చేస్తుండగా వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇళయరాజా గారి సంగీతం .. ఆర్.డి. బర్మన్ గారి సంగీతం .. బాలు గారి పాటలు వింటూ పెరిగాను. అవి నా నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. వాళ్ల స్ఫూర్తితో నేను ఈ రూట్లోకి రావడం జరిగి ఉండవచ్చు. 'శంకరాభరణం' సినిమాలోని పాటలు బాగా పాడేవాడిని .. దాంతో అంతా 'శంకరశాస్త్రి' అని పిలిచేవారు కూడా. ఆ సినిమా నేను 50.. 60 సార్లు చూశాను. ఇక గాయకుడిగా బాలూగారంటే ఇష్టం .. నేను గాయకుడిని కావడానికి ఆయనే స్ఫూర్తి" అంటూ చెప్పుకొచ్చారు

  • Loading...

More Telugu News