paytm: సరికొత్త‌ రికార్డు సృష్టించిన పేటీఎం... 100 మిలియ‌న్ల డౌన్‌లోడ్లు దాటిన ఏకైక పేమెంట్ యాప్‌

  • వెల్ల‌డించిన సంస్థ‌
  • అంచెలంచెలుగా ఎదుగుతున్న పేటీఎం
  • పేమెంట్స్ బ్యాంక్‌గా మారిన త‌ర్వాత అభివృద్ధి

రీఛార్జీ యాప్‌గా అడుగుపెట్టి షాపింగ్ స్టోర్‌, పేమెంట్‌ బ్యాంక్‌గా ఎదిగిన పేటీఎం స‌రికొత్త రికార్డును సృష్టించింది. గూగుల్ ప్లే స్టోర్ లో వంద మిలియ‌న్ల డౌన్‌లోడ్లు సంపాదించిన మొద‌టి పేమెంట్ యాప్‌గా పేటీఎం నిలిచింది. ఈ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తూ పేటీఎం అధికారిక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. డిసెంబ‌ర్ రెండో వారంలో తాము ఈ ఘ‌న‌త సాధించిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

ఈ సంద‌ర్భంగా సంస్థ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ దీప‌క్ అబోట్ పేటీఎం ఉద్యోగుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వారు చేసిన కృషి వ‌ల్లే ఇవాళ ఈ ఘ‌న‌త సాధించగ‌లిగామ‌ని ఆయ‌న అన్నారు. ఈ రికార్డును ఆద‌ర్శంగా తీసుకుని మున్ముందు వినియోగదారులకు మంచి సేవ‌ల‌ను అందిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇటీవ‌ల నియ‌ర్‌బై.కామ్‌, లిటిల్ ఇంట‌ర్నెట్ సంస్థ‌లను పేటీఎం చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News