nagarjuna: కల్యాణ్ కృష్ణ నాలుగో సినిమా నాగార్జునతోనే!
- రవితేజతో కల్యాణ్ కృష్ణ
- టైటిల్ గా 'నేల టికెట్' ఖరారు
- ఆ తరువాత సినిమా నాగ్ తో
'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాతో నాగార్జున కెరియర్లోనే భారీ విజయాన్ని కల్యాణ్ కృష్ణ ఇచ్చాడు. దాంతో ఆయనపై గల నమ్మకంతో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాను కల్యాణ్ కృష్ణకే ఇచ్చాడు. ఆ సినిమాను కూడా హిట్ చేసి ఆయన తన సత్తా చాటుకున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం మూడవ సినిమాను కూడా అన్నపూర్ణ బ్యానర్లోనే కల్యాణ్ కృష్ణ చేయవలసి వుంది. కానీ తన మూడవ సినిమాను ఆయన రవితేజతో ప్రకటించడంతో, ఆయన ధోరణి పట్ల నాగార్జున ఫీలయ్యారని సమాచారం.
తనతో కమిట్ మెంట్ ఉండగా రవితేజతో సినిమాను కల్యాణ్ కృష్ణ ఎనౌన్స్ చేయడం నాగార్జునను కాస్త ఇబ్బంది పెట్టిందట. అది గ్రహించిన కల్యాణ్ కృష్ణ .. నాగార్జునను కలుసుకుని ఆయనను కూల్ చేశాడట. తన నాల్గొవ సినిమాను నాగ్ తో చేస్తానని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని వచ్చాడట. ఇక రవితేజతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి కల్యాణ్ కృష్ణ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి 'నేల టికెట్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు.