Pakistan: జాదవ్ భార్య ధరించిన బూట్లలో కెమెరా ఉంది: ‘పాక్’ ఆరోపణ
- ఆ బూట్లలో లోహ పదార్థం ఉన్నట్టు గుర్తించాం
- అందులో కెమెరా లేదా రికార్డింగ్ చిప్ ఉండొచ్చు
- ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాం
- పాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఆరోపణ
పాకిస్థాన్ జైల్లో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్ ను కలిసేందుకు ఆయన తల్లి అవంతి జాదవ్, భార్య నేతన్ కుల్ జాదవ్ నిన్న కలిసిన విషయం తెలిసిందే. కులభూషణ్ ను కలిసి తిరిగి అక్కడి నుంచి వచ్చే సమయంలో జాదవ్ భార్య ధరించిన బూట్లను పాక్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే. దీంతో దీనిపై సర్వత్రా విమర్శలు చెలరేగడంతో, పాక్ ఓ కొత్తకథను చెబుతోంది.
ఆ బూట్లలో లోహపదార్థం ఉన్నట్లు గుర్తించారని, ఈ విషయాన్నిపాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ చెప్పినట్టు పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జాదవ్ భార్య ధరించిన బూట్లలో గుర్తించిన లోహపదార్థం కెమెరా లేదా రికార్డింగ్ చిప్ అయి ఉంటుందని, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని మహ్మద్ ఫైజల్ మీడియాకు తెలిపారు.