floating market: నీటిలో తేలియాడే మార్కెట్‌.. 2019లో కోల్‌క‌తాలో ప్రారంభం!

  • ద ఫ్లోటింగ్ మార్కెట్ ఆఫ్ పాటులీ అని పేరు
  • రూ. 10 కోట్ల వ్య‌యంతో నిర్మాణం 
  • 500 మీ.ల పొడ‌వు, 60 మీ. వెడ‌ల్పు 

బ్యాంకాక్‌, వెనిస్ దేశాల్లో క‌నిపించే నీటి మీద తేలియాడే మార్కెట్‌ను తొలిసారిగా కోల్‌క‌తాలో ఏర్పాటు చేయ‌నున్నారు. అక్క‌డ పాటులీ ప్రాంతంలో రూ. 10 కోట్ల వ్య‌యంతో దీన్ని నిర్మించనున్నారు. 2019 జ‌న‌వ‌రి క‌ల్లా దీని నిర్మాణం పూర్తికానుంద‌ని కోల్‌క‌తా మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ వెల్ల‌డించింది.

500 మీ.ల పొడ‌వు, 60 మీ.ల వెడ‌ల్పుతో దాదాపు 200ల దుకాణాలకు స‌రిప‌డే విధంగా ఈ తేలియాడే మార్కెట్‌ను నిర్మించ‌నున్నారు. ఇటీవ‌ల ప‌శ్చిమ బెంగాల్ పట్ట‌ణాభివృద్ధిశాఖ మంత్రి ఫిర్హాద్ హాకీం బ్యాంకాక్ వెళ్లిన‌పుడు అక్క‌డ ఫ్లోటింగ్ మార్కెట్‌ల‌ను చూశార‌ట‌. అలాంటి మార్కెట్‌లే కోల్‌క‌తాలో నిర్మించాల‌ని భావించిన ఆయ‌న, ఈ మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News