south africa: దక్షిణాఫ్రికా బయల్దేరిన విరాట్ - అనుష్క జంట... న్యూఇయర్ అక్కడే!
- ముంబై ఎయిర్పోర్ట్లో కనిపించిన విరుష్క
- ఇతర క్రికెటర్లు, వారి కుటుంబాలు కూడా
- జనవరి మొదటి వారంలో తిరిగి రానున్న అనుష్క
పెళ్లి, రెండు రిసెప్షన్లు... అంగరంగ వైభవంగా జరుపుకున్నాక, తమ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి విరాట్ - అనుష్క శర్మ జంట దక్షిణాఫ్రికా బయల్దేరింది. నిజానికి అక్కడ భారత జట్టు, దక్షిణాఫ్రికాతో మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందుకోసం భారత జట్టుతో కలిసి విరాట్ వెళ్తున్నాడు. అలాగే న్యూఇయర్ వేడుకలు అక్కడే జరుపుకోవాలని నిశ్చయించుకొని అనుష్క కూడా వారితో పాటు వెళ్తోంది. అనుష్క, విరాట్, ఇతర భారత జట్టు ఆటగాళ్లు, వారి కుటుంబాలు ముంబై ఎయిర్పోర్టులో నిన్న రాత్రి మీడియా కంటపడ్డారు.
జనవరి 5 నుంచి ఫిబ్రవరి 24 వరకు భారత జట్టు, దక్షిణాఫ్రికాతో ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. భారత ఆటగాళ్లందరూ న్యూఇయర్ వేడుకలను అక్కడే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి మొదటివారంలో అనుష్క తిరిగి రానుంది. వచ్చాక ఆనంద్ ఎల్ రాయ్ సినిమాలో షారుక్ సరసన నటిస్తున్న సినిమా షూటింగ్లో ఆమె పాల్గొంటుంది. అలాగే తాను స్వయంగా నిర్మించిన 'పరి' చిత్ర ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొననుంది.