Samosa: మన సమోసాకు దక్షిణాఫ్రికాలో అరుదైన గౌరవం!
- 'వీక్లీ పోస్ట్' వంటల పోటీల్లో తొలి స్థానం
- చిల్లీ చికెన్ సమోసాకు దక్కిన గౌరవం
- కశ్మీర్ కారాన్ని వాడి తయారు చేసిన సల్మా
భారతీయులు ఎంతో ఇష్టంగా తినే సమోసాకు దక్షిణాఫ్రికాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడి పత్రిక 'వీక్లీ పోస్ట్' నిర్వహించిన వంటల పోటీల్లో అత్యధికులు నచ్చిన వంటకంగా చిల్లీ చికెన్ సమోసా నిలిచింది. పోటీల్లో పాల్గొన్న వారు చాక్లెట్, జీడిపప్పు వంటి ఎన్నో పదార్థాలు వాడుతూ నోరూరించే వంటకాలను సిద్ధం చేయగా, సల్మా అజీ అనే యువతి చేసిన సమోసాలు, చూపరులను ఆకర్షిస్తూ, అత్యధికుల జిహ్వ చాపల్యాన్ని పెంచాయి.
ఈ సందర్భంగా సల్మా మాట్లాడుతూ, ప్రతి వంటకాన్నీ నిత్య నూతనంగా తయారు చేయడం తనకెంతో ఇష్టమని, తొలుత చికెన్ శాండ్ విచ్ చేయగా, ఆపై చిల్లీ చికెన్ ను వాడుతూ సమోసాలు తయారు చేయాలన్న ఆలోచన వచ్చిందని అన్నారు. కాశ్మీరీ కారాన్ని వాడటం తన సమోసాలకు మరింత రుచిని పెంచిందని చెప్పారు. ఇక ఒక నిమిషంలో పది సమోసాలు తిన్న ఇబ్రహీం అనే వ్యక్తికి ఫాస్టెస్ట్ సమోసా ఈటర్ టైటిల్ దక్కింది.