ravi shankar prasad: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా 100 ట్రిపుల్ తలాక్ కేసులు బయటపడ్డాయి: రవిశంకర్ ప్రసాద్
- ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ
- ట్రిపుల్ తలాక్ అంశంపై పార్లమెంటు చూస్తూ ఊరుకోవాలా?
- ఓటు బ్యాంకు రూపంలో ఈ బిల్లును చూడవద్దు
- తలాక్ ను పాకిస్థాన్‌లోనూ నిషేధించారు
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత సైతం 100 ట్రిపుల్ తలాక్ కేసులు బయటపడ్డాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభలో చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం శోచనీయమని అన్నారు. ఈ రోజు ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ట్రిపుల్ తలాక్ అంశంపై పార్లమెంటు చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు.
ఓటు బ్యాంకు రూపంలో ఈ బిల్లును చూడవద్దని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇది ముస్లిం మహిళల గౌరవానికి సంబంధించిన విషయం అని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ను పాకిస్థాన్‌లోనూ నిషేధించారని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్‌పై లోక్‌సభలో సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు.