Eamcet: తెలంగాణలో ఎంసెట్ సహా పలు కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు!
- మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలు
- పీఈసెట్ మినహా అన్ని ప్రవేశ పరీక్షలు ఆన్‌లైన్‌లో
- మే 9- ఈసెట్, మే 17- ఐసెట్
- మే 20- పీఈసెట్, మే 31- ఎడ్‌సెట్
తెలంగాణలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. పీఈసెట్ మినహా అన్ని ప్రవేశ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. ఎంసెట్, ఈసెట్ లు జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తుంది. లాసెట్, పీజీలాసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్‌ను ఓయూ, ఐసెట్ ను కాకతీయ యూనివర్సిటీ, పీజీసెట్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తాయి. మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఆయా పరీక్షల వివరాలు..
- మే 9- ఈసెట్
- మే 17- ఐసెట్
- మే 20- పీఈసెట్
- మే 25- లాసెట్
- మే 25- పీజీఈసెట్
- మే 26- పీజీ లాసెట్
- మే 31- ఎడ్‌సెట్