bit coin: మళ్లీ రెచ్చిపోయిన క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్!

  • తిరిగి 15,000 డాలర్ల పైకి చేరిక
  • ఒకే రోజు 8 శాతం పెరుగుదల
  • సమీప కాలంలో మళ్లీ తగ్గే అవకాశం

ఇటీవలి కాలంలో అనూహ్యంగా, అసాధారణంగా పెరిగిపోయిన డిజిటల్ కరెన్సీ (వర్చువల్ కరెన్సీ, క్రిప్టోకరెన్సీ, అనధికార కరెన్సీ) బిట్ కాయిన్ మరోసారి బలం పుంజుకుంది. ఒక్క బిట్ కాయిన్ విలువ ఈ నెల 18న 19,511 డాలర్లకు వెళ్లి, ఆ తర్వాత 15,000 డాలర్ల లోపునకు రాగా, ఈ రోజు మరోసారి 15,000 డాలర్లను దాటిపోయింది. దక్షిణ కొరియా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం బిట్ కాయిన్ పై నిషేధం విధించే యోచన ఉందన్న వార్తలతో గురువారం బాగా తగ్గిపోయింది.

మళ్ళీ ఈ ఒక్క రోజే 8 శాతం లాభపడి 15,032 డాలర్ల స్థాయికి చేరింది. ఇప్పటికీ ఇటీవలి గరష్ట స్థాయి నుంచి చూస్తే 23 శాతం తక్కువలోనే ట్రేడ్ అవుతోంది. స్వల్ప కాలంలో దీనికి 13,500 డాలర్ల స్థాయి మద్దతుగా ఉంటుందని, చికాగోకు చెందిన బెల్ కర్వ్ క్యాపిటల్ డైరెక్టర్ క్రిస్ గెర్ష్ తెలిపారు. ఫ్యూచర్ల కాంట్రాక్టుల్లో మరోసారి ఇది ఇటీవలి కనిష్ట స్థాయి (12,400 డాలర్ల స్థాయి) దిశగా పయనించే అవకాశం లేకపోలేదన్నారు.

  • Loading...

More Telugu News