whatsapp: వాట్సాప్ లో పొరపాటున కొత్త ఫీచర్ ప్రత్యక్షం.. అంతలోనే మాయం!
- డెవలపర్ల పొరపాటు
- 'రిప్లై ప్రైవేట్లీ' అనే కొత్త ఫీచర్ యాక్టివేషన్
- గ్రూప్ లోని ఓ వ్యక్తికి పర్సనల్ మెసేజ్ పంపే సదుపాయం
తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు వాట్సాప్ మొబైల్ యాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, 'రిప్లై ప్రైవేట్లీ' అనే ఫీచర్ ను వాట్సాప్ పొరపాటున యాక్టివేట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూపులో ఉన్న ఓ వ్యక్తి... గ్రూపులోని ఇతర సభ్యులకు తెలియకుండానే, ఓ వ్యక్తికి పర్సనల్ మెసేజ్ పంపవచ్చు. వాట్సాప్ బీటా అప్ డేట్ లో ఈ సదుపాయం కనిపించింది. అంతలోనే మాయమైంది.
ఈ విషయాన్ని బ్రిటన్ మీడియా వెల్లడించింది. ఈ ఫీచర్ ఇంకా డెవలప్ మెంట్ స్టేజ్ లోనే ఉందని... ఇతర కొత్త ఫీచర్లతో కలిపి ఈ ఫీచర్ ను కూడా విడుదల చేస్తారని తెలిపింది. వాట్సాప్ డెవలపర్లు పొరపాటున ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసి ఉంటారని అభిప్రాయపడింది. మరికొన్ని రోజుల్లో ఈ ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఇంతలోనే ఇది పొరపాటున ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది.