npa: లా ట్రైబ్యునల్ ముందుకు మరో 25 భారీ రుణ ఎగవేత కేసులు

  • పరిష్కారం లభించకపోవడంతో న్యాయపరమైన చర్యలు
  • జాబితాలో ఐవీఆర్ సీఎల్, నాగార్జున ఆయిల్
  • వీడియోకాన్ కు మరికొంత గడువు!

జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ కు సుమారు 25 భారీ రుణ ఎగవేత కేసులను నివేదించాలని బ్యాంకులు నిర్ణయించాయి. రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు బ్యాంకులు లోగడ 12 భారీ రుణ ఎగవేతదారులపై దివాలా చట్టం కింద పరిష్కారం కోరుతూ లా ట్రైబ్యునల్ లో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆర్ బీఐ ఆ తర్వాత గత ఆగస్ట్ లో మరో 28 రుణ ఎగవేత కేసుల్లోనూ దివాలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంకులకు జాబితా పంపింది.

ఇందులో 25 కేసులు లా ట్రైబ్యునల్ ముందుకు వెళ్లనున్నాయి. మిగిలిన మూడు కేసులు... వీడియోకాన్ ఇండస్ట్రీస్, అన్రక్ అల్యూమినియం, జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్ కు సంబంధించి పరిష్కారం కోసం మరికొంత గడువు ఇవ్వాలని బ్యాంకులు కోరాయి. డిసెంబర్ 13 నాటికి రుణ ఎగవేత కేసుల్లో పరిష్కారం కనుగొనాలని, లేదంటే దివాలా చట్టం కింద చర్యలు చేపట్టాలని ఆర్ బీఐ ఇచ్చిన గడువు ముగిసి చాలా రోజులైపోయింది. బ్యాంకులు లా ట్రైబ్యునల్ కు నివేదించనున్న కేసుల్లో ఐవీఆర్ సీఎల్ ఇన్ ఫ్రా, రుచి సోయా, నాగార్జున ఆయిల్, ఆర్కిడ్ ఫార్మా, క్యాస్టెక్స్ టెక్నాలజీస్ తదితర కంపెనీలున్నాయి.

  • Loading...

More Telugu News