vamsi: నేను చాలా తిక్క మనిషినని చాలామందే అన్నారు: దర్శకుడు వంశీ
- ఒకప్పుడు నాకు కోపం బాగా ఉండేది
- కాలక్రమేణ తగ్గుతూ వచ్చింది
- నా ధోరణి వల్లనే అలా చెప్పుకునేవారు
దర్శకుడు వంశీ పేరు వినగానే 'మంచుపల్లకి' .. 'మహర్షి' .. 'సితార' .. 'అన్వేషణ' .. 'లేడీస్ టైలర్' .. 'ఏప్రిల్ 1 విడుదల' సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ సినిమాలతో ఆయన పంచిన అనుభూతులు మనసు తలుపులు తెరుచుకుని బయటికి వస్తాయి. అలాంటి వంశీ .. తాజాగా ఐ డ్రీమ్స్ తో అనేక విషయాలను పంచుకున్నారు.
"వంశీకి చాలా కోపం .. చిరాకు .. తిక్క ఎక్కువ అని బయట అనుకుంటూ వుంటారు. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా .. ఒప్పుకోరా?" అనే ప్రశ్న వంశీకి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. " నిజంగానే నాకు ఒకప్పుడు కోపం బాగా వచ్చేది .. ఈ మధ్య రావడం లేదు. కాలం గడుస్తున్న కొద్దీ నాలో కోపం తగ్గుతూ వచ్చింది"
"క్రియేటివిటీకి .. కోపానికి సంబంధం లేదు .. బాగా ఇన్వాల్వై పని చేస్తున్నప్పుడు కోపం వచ్చి ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అందువల్లనే అనుకుంటాను .. నన్ను చాలా తిక్క మనిషిననే అనుకున్నారు. నిజం చెప్పాలంటే 'తిక్క' అనే మాటకి మించే ఒకానొక సమయంలో నా గురించి మాట్లాడుకునేవారు. నా ధోరణి వాళ్లకి అలా అనిపించిందేమోనని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.