vamsi: ఆ కథను వెంకటేశ్ తో చేద్దామనుకున్నాను .. రామానాయుడుగారు నచ్చలేదన్నారు!: దర్శకుడు వంశీ
- 'గాలికొండాపురం రైల్వే గేటు' కథ రాశాను
- 'స్వాతి'లో సీరియల్ గా వచ్చింది
- రామానాయుడు గారు కథ విన్నారు
- అది ఆయనకి నచ్చలేదు
దర్శకుడు వంశీ ఎన్నో హిట్ చిత్రాలను అందించారు .. తనదైన ముద్రతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా చాలా తక్కువ. అలాంటి వంశీ తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి మాట్లాడారు. "గతంలో మీరు 'గాలికొండాపురం రైల్వే గేటు' అనే నవల రాశారు .. దానినే మీరు వెంకటేశ్ తో సినిమా చేయాలనుకున్నారు. ఎందుకని అది వర్కౌట్ కాలేదు?" అనే ప్రశ్న వంశీకి ఎదురైంది.
" గాలికొండాపురం రైల్వే గేటు' స్వాతిలో సీరియల్ గా వచ్చింది. సినిమా కోసం నేను రెడీ చేసిన స్క్రిప్ట్ రామానాయుడు గారికి నచ్చలేదు. వెంకటేశ్ కెరియర్ ను ఆరంభించి అప్పటికి కొంతకాలమే అయింది. హీరో పాత్రకన్నా హీరోయిన్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత వుంది అన్నారు. ఆయన అనుకున్న విధంగా చేయడం నాకు చేత కాలేదు. అందుకని అది అలా ఆగిపోయింది" అని వంశీ చెప్పుకొచ్చారు.