newyear: ప్రప్రథమంగా ‘న్యూ ఇయర్’ కు స్వాగతం పలకనున్న కిరిబాటి ద్వీపం!

  • ప్రపంచంలోనే మొట్టమొదట పసిఫిక్ మహా సముద్రంలోని కిరిబాటి ద్వీపానికి కొత్త సంవత్సరం
  • భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు
  • ఆ తర్వాత చాతమ్ ఐలాండ్స్ లో వేడుకలు
  • చిట్టచివరగా  బెకర్ ఐలాండ్, హౌలాండ్ ఐలాండ్ లో న్యూ ఇయర్ వేడుకలు 

ప్రప్రథమంగా 2018 ఆంగ్ల నూతన సంవత్సరానికి పసిఫిక్ మహా సముద్రంలోని కిరిబాటి ద్వీపం (ఐలాండ్) స్వాగతం పలకనుంది. ప్రపంచంలో మొదటగా నూతన సంవత్సర వేడుకలు ఇక్కడే ప్రారంభం కానున్నాయి. భారతదేశ కాలమానం ప్రకారం డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 15.30 (3.30) గంటలకు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు ఆ ద్వీప వాసులు సిద్ధమవుతున్నారు.

కిరిబాటి ద్వీపం 33 చిన్నచిన్న ద్వీపాల సముదాయం. వీటిని గిల్ బర్బ్స్ ఐలాండ్స్ అని పిలుస్తుంటారు. ఇక కిరిబాటి ద్వీపం తర్వాత చాతమ్ ఐలాండ్స్ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం 15.45 (3.45) గంటలకు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకనుంది. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. అదే పసిఫిక్ మహా సముద్రంలోనే ఉన్న బెకర్ ఐలాండ్, హౌలాండ్ ఐలాండ్ ప్రజలు ప్రపంచంలోనే చిట్టచివరగా ఈ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోనున్నారు. ‘కిరిబాటి’లో న్యూ ఇయర్ ప్రవేశించిన 26 గంటల తర్వాత బెకర్ ఐలాండ్, హౌలాండ్ ఐలాండ్ లలో కొత్త సంవత్సరం ప్రవేశిస్తుంది.

  • Loading...

More Telugu News