muralisharma: ఎప్పుడైనా నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా? అనేవారు: మురళీశర్మ
- నటుడు కావాలనే కోరిక బలంగా ఉండేది
- సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని
- కన్నీళ్లతో వెనుదిరిగిన సందర్భాలు ఎక్కువే
తెలుగులో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ విలక్షణ నటుడు అనిపించుకున్న వారిలో మురళీ శర్మ ఒకరుగా కనిపిస్తారు. హిందీ సినిమాలతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన, ఆ తరువాత 'అతిథి' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమయ్యారు. 'అతిథి' . . 'కంత్రి'.. 'ఊసరవెల్లి' సినిమాలు తెలుగులో ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆయన తెలుగులోను బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి చెప్పుకొచ్చారు.
"మొదటి నుంచి కూడా నాకు నటుడిని కావాలని ఉండేది. ఏ సినిమా ఆఫీస్ కి వెళ్లి నా ఫోటోలు ఇచ్చినా, 'నిజంగానే నువ్ యాక్టర్ వి కావాలనుకుంటున్నావా?' అని అడిగేవారు. అవునని చెబితే .. 'ఎప్పుడైనా నువ్ నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా?" అని అనేవారు. 'దాంతో కన్నీళ్లతో నేను వెనుదిరిగేవాడిని .. ఆ మరుసటి రోజున మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో నా ప్రయత్నాలు మొదలు పెట్టేవాడిని'. అలాగే నటుడిగా నా జర్నీ మొదలైంది. ప్రస్తుతం నేను చేరుకున్న స్థానం నా కెంతో సంతోషాన్ని కలిగిస్తోంది" అని చెప్పారు.