murali sharma: ఆ సినిమా నటుడిగా నా కెరియర్ నే మార్చేసింది: మురళీశర్మ
- 'అతిథి'లో విలన్ గా చేశాను
- 'భలేభలే మగాడివోయ్' మంచి పేరు తెచ్చింది
- మారుతి గారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
తెలుగులో తనకి వస్తోన్న అవకాశాల పట్ల నటుడు మురళీశర్మ సంతోషాన్నీ .. సంతృప్తిని వ్యక్తం చేస్తూ, 'భలే భలే మగాడివోయ్' సినిమాతో వచ్చిన గుర్తింపును గురించి ప్రస్తావించారు. " 'అతిథి' సినిమాలో విలన్ గా చేశాను .. దానికి ఉత్తమ విలన్ గా నంది అవార్డు వచ్చింది. సురేందర్ రెడ్డి ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నిజం చెప్పాలంటే నాకు వచ్చిన నంది అవార్డు ఆయనకే చెందుతుంది. ఆ సినిమా కోసం ఆయన అంతగా కష్టపడ్డారు'.
"ఆ సినిమా తరువాత నేను పది .. పదిహేను సినిమాలు చేశాను. అయితే 'భలే భలే మగాడివోయ్' సినిమాతోనే నా కెరియర్ పెద్ద మలుపు తిరిగింది. 'ఆ పాత్ర కోసం మారుతి మిమ్మల్ని ఎలా తీసుకున్నారు సార్? 'అతిథి'లో .. 'కంత్రి'లో విలన్ గా వేసిన మిమ్మల్ని ఒక పాజిటివ్ ఫాదర్ పాత్రలో ఎలా అనుకున్నారు?' అని అంతా నన్ను అడుగుతుంటారు. 'నిజంగా మారుతి గారి విజన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పబ్లిక్ లోకి వెళ్లినప్పుడు నాకు నటుడుగా లభించే గుర్తింపు చూసినప్పుడు నిజంగా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది" అని చెప్పుకొచ్చారు.