sensex: తొలి రోజున నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్‌కి 244 పాయింట్ల నష్టం
- నిఫ్టీకి 95 పాయింట్ల నష్టం
- లాభాలతో ప్రారంభమై నష్టాల్లో ముగింపు
ఇటీవల రికార్డు స్థాయి పాయింట్లకు చేరుకున్న సెన్సెక్స్, కొత్త సంవత్సర ప్రారంభరోజున నష్టాల బాట పట్టింది. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కుని నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 244 పాయింట్లు నష్టపోయి 33,813 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. మార్కెట్ ముగిసే సమయానికి 95 పాయింట్ల నష్టంతో 10,435 వద్ద ముగిసింది.
ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లు కూడా బలహీనంగా ఉండటంతో మార్కెట్ బలహీనపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 63.69గా కొనసాగుతోంది. ఎన్ఎస్ఈలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, కోల్ఇండియా, సిప్లా, సన్‌ఫార్మా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్వల్పంగా లాభపడగా.. భారతీ ఇన్ఫ్రాటెల్, టీసీఎస్, భారత్ పెట్రోలియం, ఇండస్ఇండ్ బ్యాంక్, బాష్ లిమిటెడ్ షేర్లు నష్టపోయాయి.