India: థాయిలాండ్ లో భారత్, పాక్ మధ్య రహస్య చర్చలు!

  • డిసెంబర్ 27న రహస్య భేటీ
  • పాల్గొన్న అజిత్ ధోవల్, నాజర్ ఖాన్
  • వివిధ అంశాలపై చర్చలు
  • ప్రత్యేక కథనంలో 'ది డాన్'

గత సంవత్సరం డిసెంబర్ 27న భారత్, పాక్ జాతీయ భద్రతా సలహాదారుల మధ్య థాయ్ లాండ్ లో రహస్య భేటీ జరిగిందని, అజిత్ దోవల్, నాజర్ ఖాన్ లు పలు అంశాలపై చర్చించారని 'ది డాన్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రెండు దేశాల మధ్యా తిరిగి ద్వైపాక్షిక చర్చలు మొదలయ్యే దిశగా ఈ సమావేశం సహకరిస్తుందని తెలిపింది. ఇద్దరి చర్చల గురించి పాకిస్థాన్ ఎన్ఎస్ఏ అధికారి ఒకరు వివరాలు తెలిపారని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకే ఈ భేటీ జరిగిందని పేర్కొంది.

కాగా, పాక్ లో మరణశిక్షను ఎదుర్కొంటున్న కులభూషణ్ జాదవ్ ను ఆయన కుటుంబ సభ్యులు కలసి వచ్చిన రెండు రోజుల తరువాత ఈ సమావేశం జరగడం గమనార్హం. జాదవ్ భార్య, తల్లిని అవమానించేలా పాక్ అధికారులు ప్రవర్తించిన తీరుపైనా ధోవల్ ఈ సమావేశంలో తన అసంతృప్తిని వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశంపై భారత్ అధికారికంగా ఇంతవరకూ నోరు విప్పలేదు. ఇదిలావుండగా, దాదాపు 30 సంవత్సరాల క్రితం కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా, న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ రాయబార కార్యాలయాలు సోమవారం నాడు తమ తమ దేశాల్లోని అణు కేంద్రాల జాబితాలను ఇచ్చి పుచ్చుకున్నాయి.

  • Loading...

More Telugu News