air strike: వైమానిక దాడిలో బిన్ లాడెన్ మనవడు హతం?
- జూన్లో జరిగిన వైమానిక దాడి
- పాక్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో దాడి
- ఒసామా కొడుకు లేఖతో బయటకు వచ్చిన విషయం
అల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మనవడు ఒసామా బిన్ హమ్జా బిన్ లాడెన్ మరణించినట్లు తెలుస్తోంది. పన్నెండేళ్ల ఒసామా హమ్జా, పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో జూన్ - జులైలో జరిగిన వైమానిక దాడిలో మృత్యువాత పడ్డట్లు సమాచారం. కొడుకు మరణవార్తను తెలియజేస్తూ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ రాసిన లేఖ ద్వారా ఈ విషయం బయటపడింది.
అయితే ఈ లేఖలో మరణించాడని మాత్రమే హమ్జా వెల్లడించాడు. ఎలా మరణించాడనే విషయాన్ని తెలియజేయలేదు. లేఖలో హమ్జా పేర్కొన్న సమయం ప్రకారం ఒసామా హమ్జా వైమానిక దాడిలోనే మరణించి ఉంటాడని అరబిక్ మీడియా కథనాలు రాసింది.