gold: ఈ రోజు కూడా పెరిగిన బంగారం ధర!
- రూ.30,000 మార్కుకు పైనే ఉంటోన్న పసిడి ధర
- ఈ రోజు బంగారం ధర 30,450గా నమోదు
- వెండి ధర రూ.39,710
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పై పైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, దేశీయ నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు అధికంగా ఉండడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రోజు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.50 పెరిగి 30,450 గా నమోదైంది. సింగపూర్ మార్కెట్లో ఔన్స్ బంగారం 0.42 శాతం పెరిగి 1,308 డాలర్లుగా ఉంది. కాగా, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో కిలో వెండి ధర రూ. 390 తగ్గి 39,710గా నమోదైంది.