stocks: 10,000 పెట్టుబడికే ఈ స్టాక్స్ కోటీశ్వరులను చేశాయ్!

  • 20 ఏళ్లలో వేల రెట్ల వృద్ధి
  • జాబితాలో ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, శ్రీ సిమెంట్
  • రూ.10 వేలతో రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు లాభం 

చిన్న మొక్క మహా వృక్షంగా మారడమంటే అది స్టాక్ మార్కెట్లలోనే సాధ్యమేమో! ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉండగా, కొన్ని మాత్రం ఇన్వెస్టర్లను ధనవంతులు చేస్తుంటాయి. నమ్ముకున్నవారికి సిరియోగం పట్టిస్తాయని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే...

ఇన్ఫోసిస్ లో 1993 జూన్ లో రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ పెట్టుబడుల విలువ ప్రస్తుతం సుమారు రూ.3 కోట్లు. 24 ఏళ్లలో 2,973 రెట్లు పెరిగింది. ఐషర్ మోటార్స్ లో 1990 జనవరిలో రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.2 కోట్లుగా మారేది. 2,018 రెట్లు పెరిగినట్టు. శ్రీసిమెంట్ లో 1990 జనవరిలో రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే అదిప్పుడు రూ.1.91 కోట్లుగా మారేది. ఇమామీలో 1995 అక్టోబర్ లో రూ.10,000 పెట్టుబడి పెట్టి ఉంటే రూ.52 లక్షలుగా మారేది. హెచ్ డీఎఫ్ సీలో 1990 జనవరిలో రూ.10 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.48 లక్షలు అయి ఉండేది. ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్ లో జనవరి 1988లో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే  వరుసగా రూ.59 లక్షలు, రూ.56 లక్షలు అయి ఉండేది.

  • Loading...

More Telugu News