stock market: ఈ జనవరిలో స్టాక్ మార్కెట్ల గమనం ఎటు?
- జనవరి నెలలో ఎక్కువగా బేర్స్ హవా
- కానీ, ఈ జనవరిలో బుల్స్ జోరుండొచ్చన్న అంచనాలు
- గతేడాది జవనరిలోనూ నిఫ్టీకి లాభాలే
దేశీయ స్టాక్ మార్కెట్ల గమనం ఈ నెలలో ఎటువైపు ఉండొచ్చు అన్నది అంచనా వేయాలంటే గత రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుంది. జనవరి మాసం బేర్స్ కు అనుకూలంగానే ఉంటుందని చరిత్ర చెబుతోంది. కానీ, గడిచిన 12 నెలల కాలంలో చిన్న కరెక్షన్లు ఉన్నప్పటికీ మార్కెట్లు పై దిశగా కదిలినందున ఈ ఏడాది జనవరి నెలలో బుల్స్ హవా ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిఫ్టీకి 10,250 కీలక మద్దతుగా పేర్కొంటున్నారు.
చారిత్రక గణాంకాలను చూస్తే జనవరి నెలలో 60 శాతం నిఫ్టీ నష్టాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. 2008 జనవరి నెలలో మాత్రం ఏకంగా 16 శాతం నష్టపోయింది. అలాగే 2011లో 10 శాతం, 2010లో 6.6 శాతం చొప్పున నిఫ్టీ తగ్గింది. అయితే, 2012లో 12 శాతం ర్యాలీ చేసిింది. 2015లో 6.3 శాతం, చివరికి 2017 జనవరిలోనూ 5.6శాతం పెరిగింది.