Tamilnadu: తరగతి గదిలోనే విద్యార్థిని మెడలో తాళి కట్టిన విద్యార్థి!

  • తాళి కట్టమన్న తల్లి.. కట్టేసిన బాలుడు
  • వైరల్ అవుతున్న వీడియో..
  • బాల జంట కోసం గాలిస్తున్న పోలీసులు

తరగతి గదిలోనే ఓ విద్యార్థి, మరో విద్యార్థిని మెడలో తాళికట్టడం సంచలనంగా మారింది.  ఇప్పుడీ వీడియో వైరల్ అయింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఉన్న సంభాషణను బట్టి ఈ ఘటన తమిళనాడులో జరిగినట్టు తెలుస్తోంది. బాలిక మెడలో బాలుడు తాళి కడుతున్నప్పుడు తోటి విద్యార్థులు సహా బాలుడి తల్లి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోను ఆమే చిత్రీకరించినట్టు అనుమానిస్తున్నారు. బహుశా ఆమె టీచరై ఉండవచ్చని అంటున్నారు.

వీడియో వైరల్ కావడంతో స్పందించిన బాలల హక్కుల  సంరక్షణ  సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఈ బాలజంట కోసం గాలిస్తున్నారు. ఈ వీడియో మొత్తం 29 సెకన్లు ఉంది. చేతిలో తాళి పట్టుకుని నిల్చున్న బాలుడు ‘అమ్మా..’ అంటూ ఆమె ఆదేశం కోసం చూడడం స్పష్టంగా కనిపించింది. ఆ వెంటనే ‘తాళి కట్టరా..’ అంటూ మహిళ తమిళంలో చెప్పడం వినిపించింది. తల్లి ఆదేశంతో యూనిఫాంలో ఉన్న బాలిక మెడలో బాలుడు తాళికట్టాడు.  ఆ సమయంలో తరగతి గదిలో మరికొంత మంది విద్యార్థులు ఉన్నట్టు వీడియోలో కనిపిస్తోంది. అంటే క్లాసు జరుగుతుండగానే ఈ తంతు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు.

  • Loading...

More Telugu News