China: త్వరలో కూలిపోనున్న చైనా స్పేస్ స్టేషన్.. భూమికి ముప్పు?.. ఏమీ కాదంటున్న చైనా!
- బెడిసికొట్టిన చైనా ప్రయత్నం
- నియంత్రణ కోల్పోయి భూమికి దగ్గరైన స్పేస్ స్టేషన్
- 19 వేల పౌండ్ల బరువుతో వస్తున్న పెను విపత్తు
- మార్చిలోగా కూలిపోయే అవకాశం
అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యాలతో పోటీ పడాలని చైనా చేసిన ప్రయత్నం ఇప్పుడు భూమికి మహా వినాశనాన్ని తేనుందా? గతితప్పిన చైనా అంతరిక్ష కేంద్రం భూమిని ఢీకొట్టనుందా? న్యూఢిల్లీ వంటి నగరాన్ని నామరూపాల్లేకుండా చేస్తూ, కోటి మందిని బలిగొనేంత శక్తితో ఆ స్పేస్ స్టేషన్ భూమిని తాకనుందా? అవుననే అంటున్నారు స్పేస్ సైంటిస్టులు. చైనా ప్రయోగించిన తియాంగాంగ్-1 స్పేస్ స్టేషన్, 19 వేల పౌండ్ల బరువుతో భూమిపై పడనుందని, గత సంవత్సరం మార్చిలో నియంత్రణ కోల్పోయిన ఇది, నెమ్మదిగా భూమి వైపు వస్తూ, భూ కక్ష్యలోకి వచ్చేసిందని చెబుతున్నారు.
ఇది ఉత్తర, దక్షిణ ధృవాల మధ్య 43 డిగ్రీల అక్షాంశంలో ఎక్కడైనా పడొచ్చని అంచనా వేస్తున్నారు. మార్చిలోగా ఇది భూమిని తాకుతుందని, దీని మార్గంలో న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బీజింగ్, రోమ్, ఇస్తాంబుల్, టోక్యో నగరాలు ఉన్నాయని తేల్చారు. దురదృష్టవశాత్తూ, గతి తప్పిన ఈ స్పేస్ స్టేషన్ ఈ నగరాల్లో ఒకదానిపై పడితే, భారీ భవనాలు సైతం నేలమట్టమై, అక్కడి జీవరాశి మొత్తం అంతరిస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. కాగా, ఇది కూలిపోయినా పెద్దగా నష్టం ఉండదని, ఇందులో చాలా భాగం ఇప్పటికే కాలిపోయిందని, భూ వాతావరణంలోకి రాగానే, ఇది మొత్తం మండిపోతుందని చైనా చెబుతుండటం గమనార్హం. కాగా, ఇది ఇండియా, బ్రిటన్ లపై కూలిపోయే అవకాశాలు ఏమాత్రం లేవని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు.