sabari: శబరిమలై వెళ్లాలనుకున్న మహిళలకు వయసు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
- వెల్లడించిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు
- అక్రమ ప్రవేశాలను అరికట్టే ప్రయత్నం
- గత కొన్ని నెలలుగా పెరుగుతున్న అక్రమ ప్రవేశాలు
కేరళలోని శబరిమలై అయ్యప్ప సన్నిధానంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని నెలలుగా అక్రమంగా లోపలికి ప్రవేశించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారిని అరికట్టడానికి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఓ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. దీని ప్రకారం లోపలికి వెళ్లాలనుకున్న బాలికలు, మహిళలు తమ వయసును ధ్రువీకరించాల్సి ఉంటుంది. అందుకోసం చెకింగ్ సమయంలో వయసు ధ్రువీకరించే ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డు, పాస్పోర్ట్ వంటి పత్రాలను సమర్పించాలని బోర్డు అధ్యక్షుడు ఎ. పద్మకుమార్ తెలిపారు.
నైష్ఠిక బ్రహ్మచారి అయిన అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి రుతుక్రమంలో ఉన్న మహిళలు ప్రవేశించడానికి వీల్లేదు. అలాగే ఈ జనవరి 14 వరకు అయ్యప్ప భక్తుల రద్దీ ఎక్కువగా ఉండబోతున్న కారణంగా, ధ్రువీకరణ పత్రం సమర్పించడమనే నిబంధన వల్ల చెకింగ్ పనులు సులభతరం అయ్యే అవకాశం ఉంది.