lalu prasad yadav: కాసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష ఖరారు
- దాణా కుంభకోణం కేసులో దోషిగా లాలూ
- లాలూతో పాటు మరో 14 మందికి ఈ రోజు శిక్ష ఖరారు
- జార్ఖండ్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ
- లాలూకి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం
దాణా కుంభకోణం కేసులో జార్ఖండ్ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌తో పాటు మరో 15 మందిని గత నెల 23న దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. 1990-94 మధ్య కాలంలో దియోగర్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ నుంచి రూ. 84.5 లక్షల నిధులను పక్కదారి పట్టించిన కేసులో వీరంతా దోషులుగా తేలారు. ఈ కేసులో లాలు ప్రసాద్ యాదవ్‌కి ఏడు సంవత్సరాల శిక్షను విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, నిన్ననే ఈ కేసులో శిక్షను ఖరారు చేస్తారని భావించగా, అది వాయిదా పడిన విషయం తెలిసిందే. శిక్ష ఖరారును ఈ రోజు జడ్జి శివపాల్ సింగ్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించనున్నారు.