new year: న్యూఇయర్ రోజున రికార్డు స్థాయిలో ఆపిల్ యాప్ స్టోర్ అమ్మకాలు
- ఒక్కరోజునే 300 మిలియన్ డాలర్ల సంపాదన
- హాలిడే సీజన్లో 890 మిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు
- క్రిస్మస్తో ప్రారంభమైన హాలిడే సీజన్
2017 హాలిడే సీజన్లో ఆపిల్ యాప్ స్టోర్ అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా న్యూఇయర్ రోజున దాదాపు 300 మిలియన్ డాలర్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక క్రిస్మస్తో ప్రారంభమై న్యూఇయర్‌తో ముగిసిన ఏడు రోజుల హాలిడే సీజన్లో ఆపిల్ యాప్ స్టోర్ నుంచి 890 మిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగాయని ఆపిల్ మార్కెటింగ్ సీనియర్ ప్రెసిడెంట్ ఫిల్ షిల్లర్ తెలిపారు.
ఈ అమ్మకాల్లో ముఖ్యంగా పొకెమాన్ గో, సీఎస్ఆర్ రేసింగ్, స్టాక్ ఏఆర్, అమెజాన్, నైట్ స్కై, పిటు, స్నాప్‌చాట్ వంటి యాప్‌లు ఉన్నట్లు వెల్లడించారు. గత సెప్టెంబర్‌లో యాప్ స్టోర్‌లో గణనీయ మార్పులు చేస్తూ, ఎక్కువ ప్రజాదరణ పొందిన యాప్‌లపై ఆపిల్ సంస్థ ఆఫర్లను ప్రకటించింది. అంతేకాకుండా వర్చువల్ రియాలిటీని సపోర్ట్ చేసే ఐఫోన్ టెన్ విడుదల తర్వాత కొన్ని ప్రత్యేక గేమింగ్, షాపింగ్ యాప్‌లను ఆపిల్ స్టోర్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.