Pawan Kalyan: 'పవన్ కల్యాణ్‌కి నాలుగో భార్య అవ్వడానికి రెడీ' అని ఆ హీరోయిన్ అన్నారు!: పూనం కౌర్ కి కత్తి మహేశ్ కౌంటర్
- 'డబ్బులు డొనేట్ చేయండి' అంటూ కత్తి మహేశ్‌పై పూనమ్ కౌర్ విమర్శలు
- తీవ్ర విమర్శలు చేస్తూ కత్తి మహేశ్ కౌంటర్
- పవన్ ని పెళ్లి చేసుకుంటానని రెండు, మూడు ఇంటర్వ్యూల్లో చెప్పింది
- కావాలంటే యూ ట్యూబ్‌లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు చూడండి
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే రచయిత కోన వెంకట్ పరోక్షంగా కత్తి మహేశ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసి విమర్శించగా.. కత్తి మహేశ్ కూడా ఆయనకు దీటుగా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు హీరోయిన్ పూనమ్ కౌర్.. మహేశ్ కత్తిపై విమర్శలు చేసింది.
ఇతరులను విమర్శించడం ద్వారా డబ్బులు సంపాదించాలనుకునే వారి కంటే అడుక్కునే వారు ఎంతో ఉత్తములంటూ తన ట్విట్టర్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'ఆ ఫ్యాట్సోను రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోంది. పాపం.. నిరుద్యోగ సమస్య... ఎవరో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు డబ్బులు డొనేట్ చేయండి. మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి కూడా మనం ఆహారం అందిస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయం. అతనికి మంచి పని దొరకాలని కోరుకుంటున్నాను' అని మహేశ్ కత్తిని ఉద్దేశిస్తూ ఆమె వరుసగా ట్వీట్లు చేసింది.
ఈ క్రమంలో సదరు హీరోయిన్‌కి కూడా కత్తి మహేశ్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. సదరు హీరోయిన్ తనను ఫ్యాట్సో అంటూ మాట్లాడడంతోనే ఆమె సంస్కారం ఏంటో తెలిసిపోతోందని ఓ ఇంటర్వ్యూలో మహేశ్ విమర్శించారు. పవన్ కల్యాణ్ చేసిన సాయంతో ఆంధ్రప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె ఎంపికైందని అన్నారు. పవన్ మెప్పు కోసం తనపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని తెలిపారు. పవన్ కల్యాణ్ వల్ల ఆమెకు ఉద్యోగం వచ్చిందని, పవన్ కల్యాణ్ ఆమెకు బతుకుదెరువు చూపించినందుకు ఆమె తనపై విమర్శలు చేస్తోందని అన్నారు.
'పవన్ కల్యాణ్‌కి నాలుగో భార్య అవ్వడానికి రెడీ అని హీరోయిన్ పూనం కౌర్ అన్నారు. ఆమె రెండు మూడు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని తెలిపింది. కావాలంటే యూ ట్యూబ్‌లో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలను చూసుకోండి' అని కత్తి మహేశ్ అన్నారు. తాను కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయగలనని హెచ్చరించారు. తాను పాప్యులర్ కావడానికే పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నానని కొందరు అంటున్నారని, తనకు ఆ అవసరం లేదని కత్తి మహేశ్ స్పష్టం చేశారు.