Pakistan: ఇక ప్రత్యామ్నాయాలను వాడతాం.. పాక్ తీరుపై కీలక ప్రకటన చేస్తూ తీవ్రంగా హెచ్చరించిన అమెరికా!
- తాలిబన్, హక్కానీ నెట్ వర్క్ విషయంలో పాక్ కఠినంగా ఉండాల్సిందే
- పాక్‌ను డీల్ చేసే విషయంలో సిద్ధం
- ఉగ్రవాదుల స్థావరాలను పాక్ పూర్తిగా ధ్వంసం చేయాలి
ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్‌పై ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డ విషయం తెలిసిందే. ఉగ్రవాద నిరోధానికి తాము ఇచ్చిన నిధులను పాక్ దుర్వినియోగం చేసి, తమకు అసత్యాలు చెప్పిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాక్ విషయంపై అమెరికా మరింత దృష్టి పెట్టింది.
పాక్‌ను డీల్ చేసే విషయంలో తాము అన్ని రకాల ప్రత్యామ్నాయాలను సిద్ధంగా ఉంచుకున్నామని వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. తాలిబన్, హక్కానీ నెట్ వర్క్ విషయంలో పాక్ కఠినంగా ఉండాల్సిందేనని తెలిపింది. ఉగ్రవాదుల స్థావరాలను పాక్ పూర్తిగా ధ్వంసం చేయకపోతే తాము తమ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తామని, ఏం చేయాలో పాక్ నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించింది.