video: వద్దని పెళ్లికొడుకు బోరున ఏడుస్తున్నప్పటికీ బలవంతంగా పెళ్లి.. మీడియాకు చిక్కిన వీడియో!

  • బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన
  • బొకారో స్టీల్ ప్లాంట్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తోన్న వినోద్
  • ఇంటికి తీసుకెళ్లి తన సోదరితో పెళ్లి చేసిన వినోద్ స్నేహితుడు
  • అత్తారింటికి తీసుకెళ్లాలని బెదిరింపులు

బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బొకారో స్టీల్ ప్లాంట్‌లో ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న వినోద్ కుమార్ అనే యువకుడు ఇటీవల ఓ మిత్రుడి పెళ్లికి ఓ ఊరుకు వెళ్లగా ఆ గ్రామంలో ఓ వ్యక్తి వినోద్‌తో స్నేహాన్ని పెంచుకున్నాడు. వారు అప్పుడప్పుడు కలుస్తుండేవారు. తాజాగా వినోద్‌ను ఓ చోటుకి రమ్మని చెప్పిన ఆ వ్యక్తి బలవంతంగా తన సోదరిని పెళ్లి చేసుకునేలా చేశాడు. వినోద్‌కి మంచి ఉద్యోగం ఉండడంతో పెద్దలంతా కలిసి అమ్మాయికి తాళి కట్టాలని బెదిరించారు.

ఓ వ్యక్తి తుపాకీతో వినోద్ తలకి గురిపెట్టి పెళ్లి జరిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. వినోద్ సోదరుడు ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్లాలని ఆమె తరఫు బంధువులు బెదిరింపులకు దిగుతున్నారు. ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News