saudi: ప్రశ్నించినందుకు 11 మంది సౌదీ రాకుమారుల నిర్బంధం?
- పొదుపు చర్యలు ఆపేయాలని డిమాండ్
- రాజప్రాసాదం ముందు నిరసన
- రాజాజ్ఞతో నిర్బంధంలోకి
సౌదీ అరేబియాలో పొదుపు చర్యలను ప్రశ్నించినందుకు రాజ కుటుంబానికి చెందిన 11 మంది రాకుమారులను అధికారులు నిర్బంధించారు. ఈ విషయాన్ని ఆన్ లైన్ వార్తా వెబ్ సైట్ సాబ్ క్యు డాట్ ఓఆర్జీ వెలుగులోకి తీసుకొచ్చింది. తగ్గిన చమురు ధరలతో సౌదీ అరేబియాలో 2018కి సంబంధించి 195 బిలియన్ల రియాల్స్ లోటు ఉంటుందని అంచనా.
దీంతో సబ్సిడీలను తగ్గించడంతోపాటు, వ్యాట్ ను ప్రవేశపెట్టడం, రాజకుటుంబ సభ్యులకు అందించే ప్రయోజనాలకూ కోత విధించడం జరిగింది. దీంతో రాజకుటుంబానికి చెందిన కొందరు యుటిలిటీ బిల్లులను నిలిపివేయడం తదితర చర్యలకు ముగింపు పలకాలని కోరుతూ రాజప్రాసాదం ముందుకు చేరి డిమాండ్ చేశారు. రాజాజ్ఞ మేరకు అక్కడి గార్డులు వారిని అదుపులోకి తీసుకున్నారన్నది ఆ కథనంలోని సారాంశం.