Lalu Prasad Yadav: జైలులో తోటమాలిగా లాలూ... రోజుకు రూ. 93 కూలీ!
- జైలులో గార్డెనర్ గా పనిచేయనున్న లాలూ
- పశు దాణా కుంభకోణంలో దోషిగా నిరూపితుడై జైల్లో ఆర్జేడీ అధినేత
- లాలూ పేరిట బహిరంగ లేఖ విడుదల
పశుదాణా కుంభకోణంలో దోషిగా నిరూపితుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలులో పని అప్పగించారు అధికారులు. లాలూకు బిస్రా ముందా జైలులో గార్డెనర్ గా పనిచేసే అవకాశాన్ని ఇచ్చారని, అందుకు రోజుకు రూ. 93 కూలీగా లభించనుందని తెలుస్తోంది. ఇదిలావుండగా, జైలుకు వెళ్లిన లాలూ పేరిట ఓ బహిరంగ లేఖ విడుదలైంది. దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజల కోసం తాను పోరాడతానని, తనను దోషిగా తేల్చి, జైలుకు పరిమితం చేయాలని చూసినా తన పోరాటంలో వెనకడుగు వేయబోనని తెలిపారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా క్షుద్ర పూజలు చేయిస్తోందని ఆరోపించారు. తమ మాట వినకుంటే ఎవరినైనా వేధించడం బీజేపీ నైజమని నిప్పులు చెరిగారు.