haryana: హర్యానా దేశానికే ఆదర్శం... అధిక రిస్క్ గర్భిణుల కోసం ఓ ప్రత్యేక వెబ్ సైట్
- వెబ్ సైట్ లో రిస్క్ ను గుర్తించే సమాచారం
- ఎప్పుడు ఆస్పత్రికి వెళ్లాలో సమాచారం
- గర్భిణుల కోసం పోర్టల్ తీసుకొస్తున్న తొలిరాష్ట్రం
హర్యానా సర్కారు దేశంలో తొలిసారిగా అధిక రిస్క్ తో కూడిన గర్భిణుల కోసం ప్ర్యతేకంగా ఓ వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. గర్భిణి స్త్రీల్లో అధిక రిస్క్ ఉందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు తగిన సమాచారం ఈ వెబ్ పోర్టల్ లో ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆస్పత్రికి వెళ్లాలి? అన్న సమాచారంతో పాటు నిపుణుల ఆధ్వర్యంలో డెలివరీకి గాను సూచనలు కూడా ఈ పోర్టల్ ద్వారా అందుతాయి.
సర్కారు తీసుకున్న ఈ చర్యను నీతి ఆయోగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మెచ్చుకున్నట్టు హర్యానా రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఈ రాష్ట్రంలో అధిక రిస్క్ ప్రెగ్నెన్సీ విధానం గతేడాది నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ఆధారంగా రిస్క్ ఉన్న గర్భిణులను నూరు శాతం గుర్తించేందుకు వీలవుతుంది. ప్రసూతి మరణాలు, శిశు మరణాల రేటును తగ్గించేందుకు ఉపయోగపడుతుందని మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు.