Cricket: భారత్ - దక్షిణాఫ్రికా తొలి టెస్టు: వర్షంతో మూడో రోజు ఆట రద్దు
- కేప్ టౌన్ లో వర్షం
- ఒక్క బంతి కూడా ఆడకుండానే ఆట రద్దు
- అభిమానుల నిరుత్సాహం
భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆటకు ఆటంకం కలిగింది. కేప్ టౌన్ లో వర్షం కారణంగా ఈరోజు జరగాల్సిన ఆట రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత మ్యాచ్ ప్రారంభ సమయంలో భారీ వర్షం పడింది. ఆపై కాసేపు వర్షం ఆగినప్పటికీ మళ్లీ పడటంతో మ్యాచ్ ను రద్దు చేశారు. మూడో రోజు ఆటలో కనీసం ఒక్క బంతి కూడా పడక ముందే మ్యాచ్ రద్దవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.
కాగా, నిన్న రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆమ్లా (4 బ్యాటింగ్), రాగా రబడ (2 బ్యాటింగ్) నైట్ వాచ్ మెన్ గా క్రీజ్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టు 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 209 పరుగులు చేసింది.