twitter: ట్విట్టర్ బ్యాన్ చేసిన సెలబ్రిటీలు వీరే...!
- ట్రంప్ ఖాతాను బ్లాక్ చేయలేదు
- ప్రపంచ నేతల అకౌంట్లను బ్లాక్ చేయం
- రాజకీయ అంశాలపై చర్చ కోసమే
ప్రపంచ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదమైనప్పటికీ వారి ఖాతాలను బ్లాక్ చేయడం జరగదని ట్విట్టర్ స్పష్టం చేసింది. రాజకీయ అంశాలపై ప్రజల మధ్య చర్చను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అణు క్షిపణుల వినియోగంపై చేసిన పోస్టింగులపై విమర్శల నేపథ్యంలో ట్విట్టర్ ఈ ప్రకటన చేసింది. ట్రంప్ ట్విట్టర్ ఖాతా బ్లాక్ చేసినట్టూ ఆరోపణలు రాగా అవి నిజం కావు. అయితే, ట్విట్టర్ గతంలో పలువురు సెలబ్రిటీల ఖాతాలను బ్లాక్ చేసిన సందర్భాలున్నాయి.
1. అభిజీత్ భట్టాచార్య
ఈ గాయకుడు ఓ మహిళకు వ్యతిరేకంగా శృంగారాత్మక, ప్రమాదకర వ్యాఖ్యలు చేసినందుకు శిక్షగా ట్విట్టర్ ఖాతా సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో ట్విట్టర్ జాతి వ్యతిరేక, హిందూ వ్యతిరేకమైనదిగా ఆయన వ్యాఖ్యానించారు.
2. అడేలే హెల్లో
ప్రముఖ పాప్ గాయని అడెలే హెల్లో ట్విట్టర్ అకౌంట్ ను ఆమె మేనేజ్ మెంట్ టీమే బ్లాక్ చేసింది. కారణం... అడేలే పీకల దాకా మద్యం సేవించి ఇష్టమొచ్చినట్టు ఏది పడితే అది ట్వీట్ చేస్తోంది. అందుకే అలా చేశారు. కానీ, ఆ తర్వాత తిరిగి యాక్టివేట్ చేసి, అడేలే పోస్ట్ చేసినా గానీ దాన్ని జాగ్రత్తగా పరిశీలించిన మీదటే పోస్ట్ చేయడాన్ని చేసేవారు.
3. కమల్ ఆర్ ఖాన్
వివాదాస్పద కామెంట్లకు ఈయన పెట్టింది పేరు. 2017లో ఈయన సీక్రేట్ సూపర్ స్టార్ మూవీ క్లైమాక్స్ ను ట్విట్టర్లో బయటపెట్టడం, దానిపై విమర్శలు, అమీర్ ఖాన్ పై దాడి ఘటనలతో ఆయన ఖాతాను బ్లాక్ చేయడం జరిగింది. అలాగే గాయని జిమ్మీ ఏ చాన్స్, రోజ్ మెక్ గొవాన్ తదితరుల ఖాతాలూ నిషేధానికి గురయ్యాయి.