akhil: 'హలో' అక్కడ లాభాలు తెచ్చిపెట్టిందట!
- యూఎస్ లో 'హలో'కి ఆదరణ
- అక్కడ ఈ సినిమాకి లాభాలు
- విక్రమ్ కుమార్ మార్క్ మూవీ కావడమే కారణం
అఖిల్ తొలి సినిమా పరాజయంపాలు కావడంతో, ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఆయన రెండవ సినిమా 'హలో'ను నాగార్జున నిర్మించారు. ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆడలేదు. లుక్ పరంగా .. నటన పరంగా అఖిల్ కి మంచి మార్కులు పడినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో లాభాలను తెచ్చిపెట్టలేకపోయింది.
అయితే అమెరికాలో మాత్రం ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టిందని అంటున్నారు. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను 3 కోట్లకు అమ్మారు. రెండో వారాంతానికే 8 లక్షల డాలర్లకుపైగా వసూళ్లను తెచ్చిపెట్టి .. మిలియన్ డాలర్ క్లబ్ ను అందుకుంది. విక్రమ్ కుమార్ గత చిత్రాలకి యూఎస్ లో ఆదరణ లభించడం .. అక్కడ ఆయనకి మంచి మార్కెట్ ఉండటం .. అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఈ సినిమా మేకింగ్ స్టైలిష్ గా ఉండటం ఈ స్థాయి వసూళ్లకు కారణమని చెబుతున్నారు.