laptop: ప్రపంచంలో అతిపలుచని ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించిన ఏసెర్
- కేవలం 9.98 మి.మీ.ల మందం
- స్విఫ్ట్ 7 పేరుతో విడుదల
- మొదట అమెరికాలో, తర్వాత ఇతర దేశాల్లో విడుదల
కేవలం 9.98 మి.మీ.ల మందం ఉన్న అల్ట్రాపోర్టబుల్ ల్యాప్‌ట్యాప్‌ను ఏసెర్ సంస్థ ఆవిష్కరించింది. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపలుచనైన ల్యాప్‌టాప్ ఇదే. స్విఫ్ట్ 7 పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను సంస్థ విడుదల చేసింది. దూరప్రయాణాలకు వెళ్లేటపుడు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ ల్యాప్‌టాప్ ఉంది. అంతేకాకుండా తక్కువ కాంతిలో పనిచేసుకునేందుకు వీలుగా ఇందులో బ్యాక్ లిట్ కీబోర్డు కూడా ఉంది.
ఇంటెల్ కోర్ ఐ7తో ప్రాసెసర్‌తో విడుదల చేసిన ఈ ల్యాప్‌టాప్ మార్చి నెలలో అమెరికాలో మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉండనుంది. ఏప్రిల్‌లో ఇతర దేశాల్లో విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీని ధర అమెరికాలో సుమారు రూ. 1,07,470 (1699 డాలర్లు), ఇతర దేశాల్లో సుమారు రూ .1,29,329గా ఉండనుంది. ఇక ప్రత్యేకతల విషయానికొస్తే... విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ చార్జ్‌తో 10గంటల బ్యాటరీ లైఫ్, అల్యూమినియం బాడీ డిజైన్, గొరిల్లా గ్లాస్, ఎన్బీటీ టచ్ స్క్రీన్ అండ్ టచ్ ప్యాడ్, 256 స్టోరేజ్ కెపాసిటీ, 8 జీబీ ర్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉన్నాయి.