Karnool: చెన్నంపల్లి కోటలో పాతాళగంగమ్మ బావి... బావిలో కనిపించినవి ఇవే!
- కోటలో నిధులు ఉన్నాయన్న ప్రచారం
- నెల రోజులుగా సాగుతున్న తవ్వకాలు
- పాతాళగంగమ్మ బావిలో కనిపించిన 11 మెట్లు
- ఇవి ఎక్కడికి వెళతాయో తెలుసుకుంటామన్న అధికారులు
కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గుత్తి రాజులు దాచి పెట్టారని భావిస్తున్న గుప్త నిధుల కోసం పురావస్తు, మైనింగ్ అధికారులు పోలీసుల సాయంతో చేస్తున్న తవ్వకాలు కీలక దశకు చేరుకున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి తవ్వకాలు సాగుతుండగా, మూడు ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో ఏమీ లభించలేదన్న సంగతి తెలిసిందే. తాజాగా పాతాళగంగమ్మ బావిలోకి అండర్ వాటర్ కెమెరాలను పంపి శోధించగా, మూడు తలల నాగేంద్రుడి శిలారూపం, బావిలో 11 మెట్లు, దేవకన్య చిత్రాలను అధికారులు గుర్తించారు.
బావిలోని నీటిని తోడివేసి, ఆ మెట్లు ఎక్కడికి దారితీస్తున్నాయన్న విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. తాము జరుపుతున్న తవ్వకాలు గుప్తనిధుల కోసం కాదని, ఈ ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నాయన్న రీసెర్చ్ రిపోర్టుల ఆధారంగా పరిశీలన చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.