srinagar: 400 కి.మీ.లు 15 నిమిషాల్లో... తప్పు వార్తను ట్వీట్ చేసిన స్మృతీ ఇరానీ!
- టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని రీట్వీట్ చేసిన కేంద్ర మంత్రి
- శ్రీనగర్ నుంచి లెహ్ వరకు నిర్మిస్తున్న జోజిలా పాస్‌కి సంబంధించిన కథనం
- మరుసటి రోజు పత్రిక సవరణ ప్రచురించడంతో ట్వీట్ డిలీట్
శ్రీనగర్ నుంచి లెహ్ మధ్య 400 కి.మీ.ల దూరాన్ని 15 నిమిషాల్లో ప్రయాణం చేయవచ్చంటూ వెల్లడించిన ఓ వ్యాసాన్ని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ట్వీట్ చేశారు. జోజిలా పాస్ టన్నెల్ ప్రాజెక్టుకి సంబంధించి కేబినెట్ ఆమోదాన్ని తెలిపిందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. అందులో ఈ టన్నెల్ ద్వారా శ్రీనగర్ నుంచి లెహ్ మధ్య ప్రయాణ సమయం 15 నిమిషాలకి తగ్గిపోనుందని పేర్కొంది.
అయితే నిజానికి తగ్గిపోయేది రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం కాదు... జోజిలా పాస్ దాటడానికి పట్టే సమయం. ఎగుడుదిగుడు భూస్వరూపం వల్ల ప్రస్తుతం జోజిలా పాస్ దాటడానికి దాదాపు మూడున్నర గంటల సమయం పడుతోంది. అయితే తమ తప్పును మరుసటి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా గుర్తించి సవరణ ప్రచురించింది. స్మృతీ ఇరానీ కూడా ఆమె ట్వీట్‌ను డిలీట్ చేశారు.