Narendra Modi: ఇతరుల వనరులు దోచుకోవాలన్న ఉద్దేశం మాకు లేదు: ప్రధాని మోదీ
- ఇతరుల భాభాగంపై కన్నేయాలన్న ఉద్దేశం భారత్కు లేదు
- సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, వనరులను అభివృద్ధి చేసుకోవడంపైనే దృష్టి
- పీఐవో పార్లమెంటేరియన్స్ కాన్ఫరెన్స్ ప్రారంభ సదస్సులో మోదీ
అరుణాచల్ ప్రదేశ్ లోని ఉప్పర్ సియాంగ్ జిల్లా బీసింగ్ లో రహదారి నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్టు తాజాగా చైనా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక ఈ మధ్య చైనాతో తరుచూ ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఇతరుల వనరులు దోచుకోవాలన్న ఉద్దేశంగానీ, భాభాగంపై కన్నేయాలన్న ఆశ గానీ భారత్కు ఏనాడు లేదని ఆయన అన్నారు. సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, వనరులను అభివృద్ధి చేసుకోవడంపైనే భారత్ దృష్టి పెట్టిందని అన్నారు. ఈ రోజు న్యూఢిల్లీలోని ప్రవాసీ భారతీయ కేంద్రంలో జరిగిన మొదటి పీఐవో పార్లమెంటేరియన్స్ కాన్ఫరెన్స్ ప్రారంభ సదస్సులో మాట్లాడుతూ మోదీ ఇలా వ్యాఖ్యానించారు.