skiing: అంతర్జాతీయ స్కీయింగ్ పోటీల్లో భారత క్రీడాకారిణికి పతకం... పొగిడిన ప్రధాని
- ఈ పోటీల్లో భారత్‌కి ఇదే మొదటి పతకం
- రజత పతకం గెల్చుకున్న ఆంచల్ ఠాకూర్
- టర్కీలో జరిగిన పోటీలు
అంతర్జాతీయ స్కీయింగ్ కాంపిటీషన్‌లో రజత పతకం గెల్చినందుకుగాను భారత క్రీడాకారిణి ఆంచల్ ఠాకూర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పొగిడారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ పోటీల్లో భారతదేశానికి మొదటిసారి పతకం సాధించి దేశఖ్యాతి ఇనుమడింపజేసిందని ప్రధాని పేర్కొన్నారు. టర్కీలోని పాలందోకెన్ స్కీ సెంటర్‌లో జరిగిన ఆల్పైన్ ఎయ్‌డర్ 3200 కప్ పోటీల్లో ఆంచల్ రజత పతకం సాధించింది. ఈ పోటీలను ఫెడరేషన్ ఇంటర్నేషనలె దె స్కీ సంస్థ నిర్వహించింది.
'అంతర్జాతీయ స్కీయింగ్‌లో పతకం సాధించినందుకు సంతోషం. టర్కీలో నువ్వు సాధించిన చారిత్రక విజయానికి దేశం గర్విస్తోంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాను' అని మోదీ ట్వీట్ చేశారు.