pavan kalyan: 'అజ్ఞాతవాసి' 125 కోట్ల షేర్ తెస్తేనే వర్కౌట్ అవుతుందట!
- ఈ రోజునే విడుదలైన 'అజ్ఞాతవాసి'
- పవన్ అభిమానుల్లో ఉత్సాహం
- కొత్త రికార్డు సృష్టిస్తుందేమోననే ఆసక్తి
త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్లోని 'అజ్ఞాతవాసి' సినిమా, అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఈ రోజునే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 125 కోట్లకి అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 92 కోట్ల బిజినెస్ చేయగా, ఒక్క నైజామ్ హక్కులే 29 కోట్లు పలికాయి.
ఇక ఆంధ్రాలోని అన్ని ఏరియాల్లోను కలుపుకుని 63 కోట్లు పలకడం విశేషం. కర్ణాటక హక్కులు 11 కోట్లు పలకగా .. ఓవర్సీస్ హక్కులు 19.5 కోట్ల అమ్మకం జరిగింది. ఈ కారణంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 125 కోట్ల షేర్ ను సాధించవలసిందేనని అంటున్నారు. ఇప్పటివరకూ 105 కోట్ల షేర్ తో 'ఖైదీ నెంబర్ 150' నాన్ బాహుబలి రికార్డుతో కొనసాగుతోంది. ఆ రికార్డును 'అజ్ఞాతవాసి' అధిగమిస్తాడేమోననే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.