KS Jawahar: ఏపీ మంత్రి జవహర్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం!

  • దూబచర్లలో మంత్రి కారును ఢీకొట్టిన మరో కారు
  • స్వల్ప గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
  • కారు డ్రైవర్ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖా మంత్రి కేఎస్ జవహర్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్ల సమీపంలో గురువారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తులు మంత్రి కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో మంత్రి స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో  పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితులు మరో కారును కూడా ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు  సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
KS Jawahar
Andhra Pradesh
Minister
Accident

More Telugu News