pslv-c40: నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పీఎస్ఎల్వీ-సీ40!

  • నింగికెగసిన పీఎస్ఎల్వీ-సీ40
  • శ్రీహరికోట నుంచి ప్రయోగం
  • 31 శాటిలైట్లను మోసుకెళ్తున్న రాకెట్

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ40 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.29 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. తనతోపాటు 31 ఉపగ్రహాలను మోసుకెళ్లింది. వీటిలో మూడు భారత ఉపగ్రహాలు కాగా, మిగిలినని విదేశాలకు చెందిన నానో ఉపగ్రహాలు.

భారత ఉపగ్రహాల్లో కార్టోశాట్-2 ఈఆర్ ఉంది. ఈ ఉపగ్రహం సహాయంతో తుపాన్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం 1323 కిలోల బరువును ఉపగ్రహవాహక నౌక తనతో పాటు తీసుకెళుతోంది. కార్టోశాట్-2 ఉపగ్రహం బరువు 710 కిలోలు. ప్రస్తుతం పీఎస్ఎల్వీ మూడవ దశ విజయవంతంగా ముగిసింది. రాకెట్ తన లక్ష్యం దిశగా దూసుకెళుతోంది.  

  • Loading...

More Telugu News