Janasena: ఎవరా పవన్ కల్యాణ్?... చిరంజీవిని రాజకీయాల్లోకి రమ్మన్నది నేనే!: మాజీ ఎంపీ చింతా మోహన్

  • 1993లోనే చిరంజీవి వచ్చుండాలి
  • అప్పుడే అయితే సక్సెస్ అయ్యుండేవారు
  • జనసేనకు గుర్తే లేదన్న మాజీ ఎంపీ
చిరంజీవిని రాజకీయాల్లోకి రావాలని తానే కోరానని, అయితే, ఆయన తాను సలహా ఇచ్చిన 1993లోనే వచ్చుంటే విజయవంతం అయి ఉండేవారని మాజీ ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఎవరో మాత్రం తనకు తెలియదని, జనసేన పార్టీకి ఎటువంటి గుర్తూ లేదని అన్నారు.

దళితులు, కాపులు ఏకమైతే రాజ్యాధికారం సాధ్యమేనని చెప్పిన ఆయన, తదుపరి ముఖ్యమంత్రి పదవిని ఉత్తర కోస్తాకు చెందిన వ్యక్తికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి పేద ప్రజలకు ఏ మాత్రం భరోసాను ఇవ్వలేకపోయిందని వ్యాఖ్యానించిన ఆయన, ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు అవినీతిమయంగా మారిందని, దానిపై సీబీఐతో విచారణ జరిపించాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.
Janasena
Pawan Kalyan
Chiranjeevi
chinta mohan

More Telugu News