maharastra: మహారాష్ట్రలోని దహాను సముద్రతీరంలో పెను విషాదం.. 40 మంది విద్యార్థులతో వెళుతోన్న పడవ బోల్తా
- గల్లంతైన విద్యార్థుల కోసం కొనసాగుతోన్న సహాయక చర్యలు
- 25 మందిని కాపాడిన సహాయక సిబ్బంది
- నలుగురు మృతి చెందినట్లు సమాచారం
- సహాయక చర్యల్లో పాల్గొంటోన్న డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్, హెలికాఫ్టర్లు
మహారాష్ట్రలోని దహాను సముద్రతీరంలో పెను విషాదం చోటు చేసుకుంది. 40 మంది విద్యార్థులతో వెళుతోన్న పడవ బోల్తా పడింది. గల్లంతైన విద్యార్థుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సహాయక సిబ్బంది 25 మందిని కాపాడినట్లు తెలుస్తోంది. నలుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. సహాయక చర్యల్లో డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్, హెలికాఫ్టర్లు పాల్గొంటున్నాయి. దహాను సముద్రతీరానికి 2 నాటికల్ మైళ్ల దూరంలో పడవ బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు.