pongal: తెలుగు వారితో పాటు దక్షిణాదివారు అంతా జరుపుకునే పండుగ సంక్రాంతి: పవన్ కల్యాణ్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-cd498cef535e88acfef33f68382260568d8df0ac.jpg?format=auto)
- ధాన్యపు రాశులు ఇంటికి చేరు కాలం
- రైతులు సంతోషంతో జరుపుకునే సంప్రదాయపు పండుగ
- నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు
ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. 'తెలుగు వారితో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలు వేడుకగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ధాన్యపు రాశులు ఇంటికి చేరు కాలం కావడంతో రైతులు సంతోషంతో జరుపుకునే సంప్రదాయపు పండుగ సంక్రాంతి. ఈ పండుగ తరుణాన నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున తెలుగువారికి, దేశ ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.. జై హింద్' అని పవన్ అందులో పేర్కొన్నారు.